నేటి నుంచి హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ రూల్స్
నేటి నుంచి హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ నిబంధనలను అమలులోకి రానున్నాయని నగర పోలీస్ కమిషన్ సవీ ఆనంద్ తెలిపారు
నేటి నుంచి హైదరాబాద్ లో కొత్త ట్రాఫిక్ నిబంధనలను అమలులోకి రానున్నాయి. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. హైదరాబాద్ లో ఆపరేషన్ రోప్ ను అమలు చేస్తున్నామని చెప్పారు. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ట్రాఫిక్ పట్ల వాహనదారులకు అవగాహన కల్పిస్తామని అన్నారు. చలాన్లను వెంటనే అమలు చేయమని, మూడు రోజుల తర్వాత చలాన్లను విధిస్తామని సీవీ ఆనంద్ చెప్పారు.
ఉల్లంఘిస్తే...
ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని సీవీ ఆనంద్ హెచ్చరించారు. స్టాప్ లైన్ ను దాటి ముందుకు వస్తే వంద రూపాయలు జరిమానా విధిస్తామన్నారు. ఫ్రీ లెఫ్ట్ బ్లాక్ చేస్తే వెయ్యి రూపాయలు, ఫుట్ పాత్ లను ఆక్రమించినా, అడ్డంగా వాహనాలను పార్క్ చేసినా జరిమానా విధిస్తామని సీవీ ఆనంద్ తెలిపారు. తాను జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 45లో రోప్ అమలుపై తనిఖీ చేశానని అన్నారు. నాలుగు రోజుల అనంతరం వాహనదారులకు పూర్తి అవగాహన వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.