ట్రాఫిక్ చలాన్లకు భారీ స్పందన... 130 కోట్లు వసూలు
తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కు భారీ స్పందన లభించింది. కేవలం పదిహేను రోజుల్లోనూ 130 కోట్ల రూపాయలు వసూలయింది
తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కు భారీ స్పందన లభించింది. కేవలం పదిహేను రోజుల్లోనూ 130 కోట్ల రూపాయలు వసూలయింది. హైదరాబాద్ జంట నగరాల్లో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కు పోలీసు శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. కొన్నేళ్లుగా పేరుకుపోయి ఉన్న చలాన్లను క్లియర్ చేసుకునే అవకాశం వాహనదారులకు కల్పించింది. ఈ సందర్భంగా భారీ రాయితీలను ప్రకటించింది.
రాయితీలు ఇవ్వడంతో...
మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ ట్రాఫిక్ చలాన్లను క్లియరెన్స్ చేసుకోవచ్చని పేర్కొంది. ద్విచక్ర వాహనాలపై 70 శాతం రాయితీ ప్రకటించింది. వన్ టైమ్ డిస్కౌంట్ పేరుతో జంటనగరాల పోలీసులు ప్రవేశపెట్టిన ఈ స్కీంకు వాహనదారుల నుంచి ఊహించని స్పందన కన్పించింది. కేవలం పదిహేను రోజల్లోనే 130 కోట్ల రూపాయలు చలాన్ల రూపంలో రావడం పట్ల పోలీసు శాఖ హర్షం వ్యక్తం చేస్తుంది.