Hyderabad : కోచింగ్ సెంటర్లన్నీ ఖాళీ.. ఓటు వేయడానికి కదిలిన యువత

హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ లు బోసిపోయి కనిపిస్తున్నాయి. వరగగా మూడు రోజులు సెలవులు రావడంతో అందరూ తమ సొంతూళ్లకు వెళ్లారు

Update: 2024-05-12 02:23 GMT

హైదరాబాద్ లోని కోచింగ్ సెంటర్ లు బోసిపోయి కనిపిస్తున్నాయి. వరగగా మూడు రోజులు సెలవులు రావడంతో అందరూ తమ సొంతూళ్లకు వెళ్లారు. ఎక్కువ మంది ఏపీకి చెందిన వారు అమీర్ పేట్ లో కోచింగ్ తీసుకుంటారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల కోసం నిత్యం ఇక్కడ శిక్షణ ఇస్తుంటారు. ఇక్కడ శిక్షణ పొంది ఉపాధి కోసం ప్రయత్నిస్తుంటారు. నిత్యం కిటికిటలాడుతూనే ఈ వీధి ఉంటుంది. విద్యార్థులతో కళకళలాడుతుంటుంది.

అమీర్ పేటలోని...
కానీ శనివారం నుంచి వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో అందరూ సొంతూళ్లకు బయలుదేరి వెళ్లారు. సొంత గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు యువత వెళ్లడంతో ఇక్కడ కోచించ్ సెంటర్లన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. రోడ్లు కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. వ్యాపారాలు కూడా ఈ మూడు రోజులు ఉండవని చెబుతున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం వెళ్లడంతో వీధులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి.















Tags:    

Similar News