Hydra : త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్లు... ఎవరినీ వదిలపెట్టం
త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ రంగనాధ్ తెలిపారు.
త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ రంగనాధ్ తెలిపారు. హైడ్రా పేరిట ప్రత్యేక చట్టం తేనున్నట్లు కూడా ఆయన తెలిపారు. దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తుందన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను, నిబంధనలు తయారైన తర్వాత చట్టాన్ని ప్రభుత్వం రూపొందిస్తుందని తెలిపారు. హైడ్రా పోలీస్ స్టేషన్ లో నేరుగా ప్రజలు ఆక్రమణలపై ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
విద్యార్థులు నష్టపోతారని...
ఇక హైడ్రా చట్టం అమల్లోకి వచ్చిన తర్వత నేరగుా హైడ్రా పేరిట నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. చెరువులను, నాలాలను, కుంటలను ఆక్రమించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని రంగనాధ్ తెలిపారు. అది పార్టీలకు అతీతంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొన్ని విద్యాసంస్థలు కూడా అక్రమ నిర్మాణాలని తేలిందని, అయితే ఇప్పుడు చర్యలు తీసుకుంటే విద్యార్థులు ఏడాది విద్యాసంవత్సరం నష్టపోయే అవకాశముంది కనుక వారికి కొంత సమయం ఇస్తామని తెలిపారు. వాళ్లంతట వాళ్లు నిర్మాణాలను తొలగించడం మంచిదని రంగనాధ్ సూచించారు.