ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కు గడువు?

ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కు గడువు నేటితో ముగియనుంది. అయితే మరోసారి వాహనదారులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.

Update: 2022-03-31 01:42 GMT

ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కు గడువు నేటితో ముగియనుంది. అయితే మరోసారి వాహనదారులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఏప్రిల్ 15వ తేదీ వరకూ క్లియరెస్స్ కు గడువు పొడిగిస్తూ పోలీసు శాఖ నిర్ణయం తీసుకుంది. మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ చలాన్ల క్లియరెన్స్ కు పోలీసు శాఖ అనుమతి ఇచ్చింది. భారీ రాయితీలను కూడా ప్రకటించింది. మొత్తం 2.40 కోట్ల రూపాయల చలాన్ల వరకూ క్లియరెన్స్ చేశారు. తద్వారా 240 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాలో జమ అయింది.

ఏప్రిల్ 15వ తేదీ వరకూ....
అయితే ఇంకా కొందరు చలాన్ల క్లియరెన్స్ కు ముందుకు రాలేదు. కేవలం 52 శాతం మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. దీంతో వారికోసం మరో 15 రోజులు గడువు పొడిగించారు. ఏప్రిల్ 15వ తేదీ వరకూ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ చేసుకునే వీలు కల్పించారు. రాయితీని కూడా కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పోలీసు శాఖ వాహనదారులను కోరుతుంది.


Tags:    

Similar News