Breaking : హైదరాబాద్‌లో ఈడీ అధికారుల సోదాలు
హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.;
హైదరాబాద్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు మొత్తం పదిహేను చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు.ఉదయం నుంచి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో పది హేను చోట్ల ఈ దాడులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేస్తుండటం కలకలం రేపుతుంది.
అందిన సమాచారం మేరకు...
అయితే ఈడీ అందిన సమాచారం మేరకే ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. మనీలాండరింగ్, ఇతర విషయాల్లో తమకు సమాచారం అందడంవల్లనే ఈ సోదాలు నిర్వహిస్తున్నారని తెలియ వచ్చింది. అయితే ఎక్కడ? ఎవరి ఇళ్లలో, కార్యాలయాల్లో దాడులు నిర్వహిస్తున్నారన్నది మాత్రం ఈడీ అధికారులు గోప్యంగా ఉంచారు.