18 రోజుల పసికందు లక్ష రూపాయలకు విక్రయించిన కసాయి తండ్రి..గుట్టురట్టు చేసిన పోలీసులు

ఈ రోజుల్లో పిల్లలు లేనివారు ఎన్నో దేవుళ్లను, ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. అంతేకాదు

Update: 2024-07-12 12:32 GMT

Hyderabad

ఈ రోజుల్లో పిల్లలు లేనివారు ఎన్నో దేవుళ్లను, ఎన్నో పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. అంతేకాదు ఎంతో మంది డాక్టర్లను సంప్రదిస్తూ పిల్లలు కావాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయితే పిల్లలు కలుగడం లేదు. కొందరు పుట్టిన పుల్లలనే అమ్మేసుకుంటున్న ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. 18 రోజుల పసికందును విక్రయించిన 24 గంటల్లోనే బండ్లగూడ పోలీసులు కేసును ఛేదించి, ఆమె తండ్రితో సహా ముగ్గురిని శుక్రవారం అరెస్టు చేశారు. చిన్నారిని సురక్షితంగా రక్షించి తల్లికి అప్పగించారు.

బండ్లగూడలోని మహ్మద్‌ నగర్‌లో నివాసం ఉంటున్న ఆటోడ్రైవర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ (43), అతని భార్య అస్మాబేగం (31)కు జూన్‌ చివరి వారంలో ఆడపిల్ల పుట్టింది. ఆ దంపతులు ఆమెకు హఫీజా అని పేరు పెట్టారు. అయితే ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆసిఫ్ బిడ్డను విక్రయించి అప్పు తీర్చాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో నివాసముంటున్న చాంద్‌ సుల్తానా (55) వద్దకు వెళ్లి ఆడపిల్లను అమ్మేందుకు రూ.లక్షకు బేరం కుదుర్చుకున్నాడు. జూలై 8న, ఆసిఫ్ తన బిడ్డను సమీపంలోని దుకాణానికి తీసుకెళ్తున్నట్లు తన భార్యకు తెలియజేసాడు, కాని కొన్ని గంటల తర్వాత ఒంటరిగా, నవజాత శిశువు లేకుండా ఇంటికి తిరిగి వచ్చాడు.

పిల్లల ఆచూకీ గురించి అస్మా అడిగినప్పుడు, ఆసిఫ్ అస్పష్టంగా సమాధానమిచ్చాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఆమె అతడిని ఎదిరించి నిలదీసింది. ఆమె గురువారం మాత్రమే పోలీసులను ఆశ్రయించింది. అధికారికంగా ఫిర్యాదు చేసింది, 18రోజుల పాపను కర్ణాటక రాష్ట్రానికి చెందిన మినాల్ సాద్‌ అనే వ్యక్తికి విక్రయించేందుకు బేరం సైతం కుదుర్చుకున్నాడు. లక్ష రూపాయలకు చాంద్ సుల్తానా అనే మహిళ ద్వారా విక్రయించాడు. వెంటనే అస్మా బండ్లగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కేసు నమోదు చేసుకున్న బండ్లగూడ పోలీసులు 24 గంటల లోపే గుట్టురట్టు చేశారు. కేవలం ఒక రోజులోనే కేసును చేధించారు. 18రోజుల పసికందును కర్ణాటక రాష్ట్రానికి వెళ్లి రక్షించి తల్లికి అప్పగించారు పోలీసులు. ఈ కేసులో బాలిక తండ్రి అసిఫ్, మధ్యవర్తి చాంద్ సుల్తానా, బాలికను కొన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన మినాల్ సాద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Tags:    

Similar News