Manchu Mohan Babu : మోహన్ బాబు గడువు నేటితో ముగిసిందా?

సినీ నటుడు మంచు మోహన్ బాబుకు హైకోర్టులో ముందస్తు బెయిల్ లభించకపోవడంతో ఈరోజు ఏం చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

Update: 2024-12-20 02:19 GMT

సినీ నటుడు మంచు మోహన్ బాబుకు హైకోర్టులో ముందస్తు బెయిల్ లభించకపోవడంతో ఈరోజు ఏం చేస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మోహన్ బాబును అరెస్ట్ చేయనున్నారని ప్రచారం జోరుగా జరుగుతుంది. జ‌ర్న‌లిస్ట్‌పై దాడి కేసులో ఆయ‌నపై ఇప్ప‌టికే హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదైంది. తాజాగా ఆయ‌న త‌ర‌పున న్యాయ‌వాది.. మోహ‌న్ బాబును సోమ‌వారం వ‌ర‌కు అరెస్ట్ చేయొద్ద‌ని హైకోర్టును కోరారు. అయితే కోర్టు వారి అభ్య‌ర్థ‌న‌ను తిరస్క‌రించింది.

అరెస్ట్ చేస్తారా?
ఈ క్ర‌మంలోనే మోహ‌న్ బాబును ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. మోమోహన్‌బాబు ను సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా..ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది కోరినా కౌంటర్‌ దాఖలు చేశాకే తీర్పు ఇస్తామని హైకోర్టుతదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. దీంతో మోహన్ బాబు ను నేడు అరెస్ట్ చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం ఊపందుకుంది.


Tags:    

Similar News