నిండుకుండలా హుస్సేన్ సాగర్

హుస్సేన్ సాగర్ కు వరద నీరు భారీగా చేరుతుంది. గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో దాదాపు నిండిపోయింది.

Update: 2022-07-13 05:52 GMT

హుస్సేన్ సాగర్ కు వరద నీరు భారీగా చేరుతుంది. గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో దాదాపు నిండిపోయింది. నిండుకుండలా మారింది. హుస్సేన్ సాగర్ పూర్తి సామర్థ్యం నీటి మట్టం 514 అడుగులు కాగా, ప్రస్తుతం 513 అడుగులకు చేరింది. ఇప్పటికే కిందకు నీళ్లు వదిలిపెడుతున్నారు. హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హెచ్చరికలు జారీ చేసింది.

లోతట్టు ప్రాంతాలు...
గత ఐదు రోజుల నుంచి హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో హుస్సేన్ సాగర్ నిండింది. ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ హైదరాబాద్ లో 68 శాతం వర్షపాతం నమోదయిందని అధికారులు చెబుతున్నారు. ఈరోజు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని సూచించడంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.


Tags:    

Similar News