Hyderbad : తినకురా..చెడకురా… హైదరాబాద్ ఫుడ్ తీరిది

హైదరాబాద్ నగరంలో లభించే ఫుడ్ కలుషితమవుతుందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి

Update: 2024-12-11 12:34 GMT

హైదరాబాద్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. హైదరాబాద్ అంటే ఒక బిర్యానీ.. ఒక చాయ్.. ఒక బిస్కెట్… ఇరానీ చాయ్ నుంచి ఇడ్లీ వరకూ ఫేమస్. హైదరాబాద్ లో దొరకని ఫుట్ ఐటమ్స్ అంటూ ఏదీ ఉండదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా కోనసీమ రుచులు, రాయలసీమ రుచులంటూ, తెలంగాణ స్పెషల్స్ అంటూ ఆహార ప్రియులను ఆకట్టుకునేలా అనేక హోటళ్లు వెలిశాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. అడగడుక్కీ ఒక హోటల్. స్ట్రీట్ ఫుడ్ నుంచి స్టార్ హోటల్స్ వరకూ హైదరాబాద్ లో అందుబాటులో ఉన్నాయి.



 


శుభ్రత ఎక్కడ?
అయితే ఎక్కడా శుభ్రత పాటించడం లేదు. కనీసం నాణ్యత ప్రమాణాలను కూడా యాజమాన్యాలు చూసీ చూడనట్లు వదిలేస్తున్నాయి. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో అనేక హోటల్స్ లో కల్తీ అని తేలింది. నాసిరకమైన పదార్ధాలు వాడటంతో పాటు నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు తేలింది. పేరున్న హోటల్స్ లో జరిపిన దాడుల్లోనూ నాసిరకం వంటలు అని బయటపడటంతో అస్సలు హైదరాాబాద్ లో తినడం సేఫ్టీయేనా? అన్న అనుమానం కూడా ఆహార ప్రియుల్లో కనపడుతుంది.
రాజధాని కావడంతో…
హైదరాబాద్ రాష్ట్ర రాజధాని కావడంతో పాటు అనేక మంది ఏపీకి చెందిన వారు ఇక్కడ ఉండటం, ఐటీకి నెలవుగా మారడంతో రోజుకు లక్షల మంది నగారానికి వస్తుంటారు. వారంతా బయట ఫుడ్ తినడానికే ఇష్టపడతారు. కానీ హైదరాబాద్ లో ఫుడ్ తింటే మాత్రం ఆసుపత్రి పాలు కావాాల్సిందేనని నిపుణులు కూడా చెబుతుండటం ఆందోళనకు తావిస్తుంది. అసలు హైదరాబాద్ ఆహారం విషయంలో సురక్షితమైన నగరమేనా? అన్న అనుమానం కలుగుతుంది. దేశంలోనే కల్తీలో మొదటి స్థానం సంపాదించుకున్నహైదరాబాద్ నగరం చెడ్డపేరును మూటగట్టుకుంది. ఇప్పటికైనా హోటల్స్ యజమానులు లాభాపేక్ష కొంత మానుకుని సురక్షితమైన ఆహారాన్ని అందించాలని కోరుతున్నారు.



Tags:    

Similar News