Hyderabad : మరో రెండు గంటలు ట్యాంక్‌బండ్ వైపు వెళ్లొద్దు...కొనసాగుతున్న నిమజ్జనం
గణేశ్ నిమజ్జనం ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. వందలాది విగ్రహాలు నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్ వద్ద ఉన్ానయి
గణేశ్ నిమజ్జనం ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఇంకా వందలాది గణపతి విగ్రహాలు నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌కు చేరుకుంటున్నాయి. బషీర్‌బాగ్ లోని బాబూ జగజ్జీవన్‌రామ్ విగ్రహం వరకూ వాహనాలు నిలిచిపోయాయి. అయితే ఉదయం కావడంతో పోలీసులు వాహనాలను సింగిల్ లైన్ లో అనుమతిస్తున్నారు. మరో గంట పాటు సాధారణ ట్రాఫిక్ ను కూడా అనుమతించే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే రెండు గంటల పాటు విధులకు వెళ్లే ఉద్యోగులు ట్యాంక్ బండ్ పరిసరప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిదన్న సూచనలు వెలువడుతున్నాయి.
ఇంకా విగ్రహాలు...
నిమజ్జనం ఉదయానికే పూర్తి చేయాలనుకున్నా సాధ్యపడలేదు. ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం నిన్న మధ్యాహ్నం 1.30 గంటలకు నిమజ్జనం పూర్తి చేసుకున్నా ఇంకా పదుల సంఖ్యలో వాహనాలు ట్యాంక్‌బండ్ లో నిమజ్జనం చేసేందుకు తరలి వస్తున్నాయి. ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్‌లో ఇంకా అనేక గణేశ్ విగ్రహాలుండటంతో నిమజ్జనానికి మరింత సమయం పట్టే అవకాశముందని అధికారులు తెలిపారు. వీలయినంత త్వరగా నిమజ్జన ప్రక్రియను పూర్తి చేయాలనుకున్నప్పటికీ సాధ్యపడలేదు.