జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాస

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. దీంతో సభను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఐదు నిమిషాల పాటు వాయిదా వేశారు;

Update: 2025-01-30 06:26 GMT
GHMC council,  meeting, brs, congress
  • whatsapp icon

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. దీంతో సభను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఐదు నిమిషాల పాటు వాయిదా వేశారు. మేయర్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనకు దిగడంతో సమావేశం గందరగోళంగా మారింది. బడ్జెట్‌పై మాట్లాడాలని మేయర్‌ విజయలక్ష్మికోరినప్పటికీ ప్రశ్నోత్తరాలకు బీఆర్‌ఎస్‌ పట్టుపట్టడంతో గందగోరళ పరిస్థితులు నెలకొన్నాయి.

మేయర్ పోడియం చుట్టూ...
మేయర్‌ పోడియం బీఆర్ఎస్ కార్పొరేటర్లు చుట్టుముట్టారు. బీఆర్ఎస్‌కు పోటీగా కాంగ్రెస్ సభ్యుల ఆందోళనకు దిగడంతో సభలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. మేయర్‌పై కాగితాలు బీఆర్ఎస్ సభ్యులు చించి విసిరేశారు. మేయర్‌కు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్‌ సభ్యులను అడ్డుకున్న మార్షల్స్‌ వారిని బయటకు పంపారు. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.


Tags:    

Similar News