నేడు జీహెచ్ఎంసీ సమావేశం.. బడ్జెట్ ఎంతంటే?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నేడు జరగనుంది. బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించనుంది;

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం నేడు జరగనుంది. బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించనుంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 8,340 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ ను సమావేశం ఆమోదించనుంది. 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పై నేడు కీలక సమావేశం జరగనుంది.
అన్ని పార్టీలూ...
అయితే ఈ సమావేశంలో బీఆర్ఎస్ మేయర్ పై అవిశ్వాసం పెట్టాలన్న నిర్ణయానికి వచ్చింది. బలాబలాలను పరిశీలించుకున్న తర్వాత అవిశ్వాసం పెట్టే అవకాశాలున్నాయి. అయితే బడ్జెట్ ప్రతిపాదనలపై బీజేపీ కార్పొరేటర్లు కూడా అసంతృప్తిగా ఉన్నారు. బడ్జెట్ ఆమోదం పొందే అవకాశం ఉందా? లేదా? అన్నది కూడా సస్సెన్స్ గానే ఉందని బల్దియా వర్గాలు వెల్లడింాచయి. సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు ఎలా వ్యవహరిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.