హైదరాబాద్ లో భారీ వర్షం.. తప్పని ట్రాఫిక్ కష్టాలు
పంజాగుట్ట, ఖైరతాబాద్ విద్యుత్ సౌధ, కెసిపి, సిఈవో, నిమ్స్ నుండి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీనగర్ కాలనీ..
హైదరాబాద్ నగరంలో చిన్న వర్షానికి భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడం షరా మామూలైపోయింది. జీహెచ్ఎంసీ ఎంత చొరవ తీసుకున్నా.. వర్షాల సమయంలో మాత్రం ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. అసలే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం.. ఈ సమయంలో వర్షం కురిస్తే.. ఇక అంతే సంగతులు. త్వరగా ఇల్లు చేరుకోవాలన్న మాట మరిచిపోవాల్సిందే. మరోసారి సోమవారం సాయంత్రం భారీ వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. పంజాగుట్ట, ఖైరతాబాద్ విద్యుత్ సౌధ, కెసిపి, సిఈవో, నిమ్స్ నుండి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీనగర్ కాలనీ సుల్తాన్ ఉలూమ్ కళాశాల, చట్నీస్, ఎన్ ఎఫ్ సి ఎల్ నుండి పంజాగుట్ట వైపు వాహనాల రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు పంజాగుట్ట పోలీసులు రంగంలోకి దిగారు. భారీ వర్షం కురుస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతుందని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలలో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.