Hyderabad : ఈరోజు కూడా ఇంట్లోనే ఉండండి.. హైదారాబాదీలకు రెడ్ అలెర్ట్

ఈరోజు కూడా హైదరాబాద్ లో భారీ వర్షం పడనుంది. అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు

Update: 2024-09-02 02:19 GMT

ఈరోజు కూడా హైదరాబాద్ లో భారీ వర్షం పడనుంది. అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. గత మూడు రోజల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ప్రత్యేకంగా ప్రజలకు వివరించారు.

జీహెచ్ఎంసీ హెచ్చరిక..
ఎక్కడా మ్యాన్‌హోల్స్ ఓపెన్ చేయకూడదన్నరు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటకు రావాలని అధికారులు కోారారు. ఇంట్లో ఉండటం సురక్షితమని అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా రహదారులపై గుంతలు ఏర్పడ్డాయని, వాహనదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. జీహెచ్ఎంసీ సిబ్బంది నిరంతరం ప్రజలకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటారని చెప్పారు. అత్యవసరమైతే040 - 211111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని ఆమ్రపాలి తెలిపారు.


Tags:    

Similar News