Hyderabad Rain : హైదరాబాద్ లో భారీ వర్షం.. రహదారులు జలమయం

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి కూడా నీరు చేరింది.

Update: 2024-12-26 11:47 GMT

హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో రహదారులన్నీజలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి కూడా నీరు చేరింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు ఏపీ, తెలంగాణలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా వాతావరణం ఉదయం నుంచే మారింది. చల్లటి గాలులతో ప్రారంభమై తర్వాత మధ్యాహ్నానికి భారీ వర్షం పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో...
అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలహీన పడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. మరొక వైపు తీరం వెంట 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున, సముద్రంలో అలజడి కూడా ఎక్కువగా ఉంటుందని మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now


 


Tags:    

Similar News