Hyderabad : హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం.. హై అలెర్ట్ ప్రకటించిన అధికారులు
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. రాత్రికి మరోసారి వర్షం కురుసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు
హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. రాత్రికి మరోసారి వర్షం కురుసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. రహదారులన్నీ నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది. దీంతో పాటు అనేక లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో ప్రజలు ఇవ్బంది పడుతున్నారు. అనేక చోట్ల చెట్లు నేలకు ఒరిగిపోయాయి. ఒక అరగంట సేపు వాన దంచి కొట్టడంతో నగరవాసులు కాసేపు వణికిపోయారు.
విద్యుత్తు సరఫరాకు ...
దీంతో నగరంలో అనేక చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రికి మరోసారి వర్షంతో పాటు ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో జీహెచ్ఎంసీ అధికారులు అలెర్ట్ అయ్యారు. మ్యాన్ హోల్ మూతలను ఎవరూ తెరవవద్దనికోరారు. జీహెచ్ఎంసీ సిబ్బంది మాత్రమే వాటిని ఓపెన్ చేస్తారని, నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాత్రికి వీలయినంత వరకూ నగరవాసులు బయటకు రాకుండా ఉంటేనే మంచిదని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు.