Manchu Manoj : నన్ను తొక్కేస్తున్నారు.. మంచు మనోజ్ తాజా ఆరోపణ
హైదరాబాద్ లోని మోహన్ బాబు ఇంటి వద్ద ఇంకా హైడ్రామా కొనసాగుతుంది. మంచు మనోజ్ ఇంటి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు
హైదరాబాద్ లోని మోహన్ బాబు ఇంటి వద్ద ఇంకా హైడ్రామా కొనసాగుతుంది. మంచు మనోజ్ ఇంటి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. తాను ఆస్తి కోసమో, డబ్బుకోసమో పోరాటం చేయడం లేదని, ఆత్మగౌరవం కోసమే తన పోరాటమని ఆయన తెలిపారు. తనను తొక్కేసేందుకు కుట్ర జరుగుతుందని, అందులో భాగంగా భార్యను, తన పిల్లలను తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు.
తన భార్యకు బెదిరింపులు...
తన కు సంబంధించిన బౌన్సర్లను బయటకు పంపి, విష్ణుకు సంబంధించిన బౌన్సర్లను అక్కడే ఉంచారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను బెదిరింపులకు లొంగనని తెలిపారు. ఏదైనా ఉంటే మగాడినైన తనపై కక్ష తీర్చుకోవాలని, భార్య పిల్లలపై చూపితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తన భార్యను బెదిరిస్తున్నారని, తన భార్య పిల్లలకు రక్షణ కల్పించాలని కోరితే పోలీసులు అవతలి పక్షాన నిలుస్తున్నారని ఆయన ఆరోపించారు. తనకు సంబంధించిన మనుషులను బయటకు పంపడమేంటని ఆయన ప్రశ్నించారు. తాను దేనికీ భయపడను అని మంచు మనోజ్ తెలిపారు. కాగా జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.