Hyderabad Water Crisis : థాంక్ గాడ్.. మూడు నెలలు ముహూర్తాల్లేవ్ ... కొంత వరకూ నీటి ముప్పు తప్పినట్లే
హైదరాబాద్ నగరం కొంత నీటి ఎద్దడి నుంచి బయటపడినట్లే. మూడు నెలలు ముహూర్తాలు లేకపోవడం మంచిదేనంటున్నారు;
కరకంగా ఈ సమ్మర్ లో మూఢమి రావడం మంచే జరుగుతుంది. పెళ్లిళ్లకు ముహూర్తాలు లేవనే బాధ తప్పించి పెద్ద బాధ నుంచి హైదరాబాద్ నగరం తప్పించుకున్నట్లయింది. ఇప్పటికే జలాశయాలు పూర్తిగా ఎండి పోయాయి. భూగర్భజలాలు అడుగంటి పోయాయి. హైదరాబాద్ లో నీటి సమస్య తీవ్రం కానుంది. ఎక్కడి నుంచి హైదరాబాద్ నగారానికి నీళ్లు తేవాలన్నా నీటి కొరత అధికారులను వెక్కిరిస్తుంది. ఇలాంటి సమయంలో గుడ్ న్యూస్ అనే అనుకోవాలి. ఈ నెల 28వ తేదీతో ముహూర్తాలకు కామా పడనుంది. దీంతో కొంత వరకూ నీటి ఇబ్బందుల నుంచి నగరం తప్పించుకునేందుకు అవకాశం మాత్రం లభించింది.
ఏప్రిల్ 28వ తేదీ వరకూ మంచి ముహూర్తాలున్నాయి. ఆ తర్వాత మూడు నెలలు ముహూర్తాలు లేవు. మూడు నెలలు ప్రారంభం కానుంది. శుభకార్యాలు ఇక మూడు నెలలు చేయరు. పెళ్లిళ్లతో పాటు గృహప్రవేశాల వంటి వాటికి కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అదే ఇప్పుడు నగరానికి కలసి వచ్చే విధంగా ఉంది. పెళ్లిళ్లు సాధారణంగా ఆగస్టు చివర వరకూ ప్రతి ఏడాది జరుగుతుంటాయి. అందులోనూ మే నెలలో పెళ్లిళ్లు అధికంగా జరుగుతుంటాయి. కానీ ఈసారి మాత్రం మూఢమి కావడంతో పెళ్లిళ్లు మళ్లీ ఆగస్టు వరకూ జరిగే అవకాశాలు లేవు. అది ఒక అదృష్టమనే చెప్పాలంటున్నారు అధికారులు.
నీటి వాడకం ఎక్కువయితే...
ఎందుకంటే.. పెళ్లిళ్లు.. శుభకార్యాలంటే ఎక్కువ నీటి వినియోగం జరుగుతుంది. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు బంధువులు, స్నేహితులు వస్తారు. విందులు ఎక్కువగా జరుగుతాయి. దీంతో ఒక పెళ్లికి ఎంత నీరు వినియోగం అవుతుంది అని అంచనా వేసుకుంటేనే చాలు గుండెలు బాదుకునే పరిస్థితి. నీటి ఎద్దడి ఉన్న ఈ పరిస్థితుల్లో శుభకార్యాలు మూడు నెలలు జరగకపోవడం మంచిదేనంటున్నారు. హైదరాబాద్ కు కూడా బంధువులు రాకపోకలు తగ్గుతాయి కాబట్టి నీటి వాడకం తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి ఎద్దడి నుంచి ఎలా అధిగమించాలా? అని తలలు పట్టుకుంటున్న అధికారులకు మూఢమి మూడు నెలలు కలసి వచ్చిందనే అనుకోవాలి. ఎందుకంటే జులై, ఆగస్టు నెలలో వానలు పడతాయి. ఇక నీటి ఇబ్బంది ఉండదన్నది అధికారుల అభిప్రాయంగా ఉంది.