విల్లాలు.. ప్లాట్లు.. కమర్షియల్ కాంప్లెక్స్ లు.. కోట్లాది ఆస్తులు
హైదరాబాద్ ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు
హైదరాబాద్ ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కుమార్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిని నిఖేశ్ ను ఏసీబీ కార్యాలయానికి నిఖేష్ తరలించారు. ఈరోజు న్యాయస్థానం ఎదుట ఏసీబీ అధికారులు హాజరుపర్చనున్నారు. ఇప్పటికే మార్కెట్ విలువ ప్రకారం ఆదాయనికి మించిన ఆస్తులు 200 కోట్లు ఉన్నట్లు గుర్తించారు.
నేడు కోర్టులో...
ఇరిగేషన్ ఏఈఈగా ఉండి గండిపేట బఫర్‌జోన్‌లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. అలేగా నిఖేష్ నిఖేష్ పేరిట మూడు ఫామ్‌హౌస్‌లు, మూడు విల్లాలతో పాటు మియాపూర్, శంషాబాద్, గచ్చిబౌలిలో ప్లాట్లు, మియాపూర్‌లో కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. లంచం తీసుకుంటుండగా పట్టుబడిన నిఖేష్ ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు.