Hyderabad: నడుస్తున్న కారులో మంటలు.. ప్రయాణికులుంగానే డ్రైవర్‌ ఏం చేశాడంటే..

హైదరాబాద్‌ నగరంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎండకాలం కాబట్టి అగ్ని ప్రమాదాలు;

Update: 2024-03-06 10:57 GMT

Hyderabad Fire

హైదరాబాద్‌ నగరంలో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఎండకాలం కాబట్టి అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా బుధవారం హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ రోడ్డు వద్ద మధ్యాహ్నం నడుస్తున్న కారులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

కారు లక్డీకాపూల్ నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో మంటలు చెలరేగడంతో డ్రైవర్‌ అప్రమత్తమై కారును రోడ్డ పక్కన నిలిపివేశాడు. దీంతో అందులో ఉన్న వారంతా వెంటనే దిగిపోయారు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే కారులో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్‌ పంపును మూసి వేశారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.



Tags:    

Similar News