హైదరాబాద్ లో కుప్పకూలిన ఫ్లై ఓవర్
రాత్రి మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్ప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
హైదరాబాద్ లో ఫ్లై ఓవర్ కుప్పకూలింది. ఎల్బీనగర్, సాగర్ రింగ్ రోడ్ లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ కుప్పకూలి పది మందికి గాయాలు అయ్యాయి. మిక్సర్ తయారు చేసే లారీ రివర్స్ తీసుకునే సమయంలో అది తాకడంతో ఒక్క సారిగా బైరామల్ గూడా ఫ్లై ఓవర్ ర్యాంప్ కూలింది. రెండు పిల్లర్ల మధ్య ఉన్న ర్యాంప్ కూలుతున్నది చూసి అక్కడే ఉన్న కార్మికులు వెంటనే అప్రమత్తం అవ్వడంతో ప్రాణాపాయం జరగలేదు.
రాత్రి మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్ప్రతికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, బీహార్ కు చెందిన కార్మికులు ఈ ప్రమాదంలో గాయపడ్డారని తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని జీహెచ్ఎంసీ కమీషనర్ సందర్శించారు. ఘటన దురదృష్టకరం అన్నారు. ఘటన మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఎల్బీనగర్ బైరమలగూడలో ఫ్లైఓవర్ కూలిపోయిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.