నాకు తెలిసిన వాళ్ల పిల్లలు డ్రగ్స్ కు ఎడిక్ట్ అయ్యారు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తుందని ఆయన అన్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ చాపకింద నీరులా విస్తరిస్తుందని ఆయన అన్నారు. దేశంంలో రెండు ముఖ్యమైన సమస్యలు ముందున్నాయన్నారు. ఒకటి నిరుద్యోగం, రెండు డ్రగ్స్ అని ఆయన చెప్పారు. డ్రగ్స్ ను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సీవీ ఆనంద్ చెప్పారు. ఉడ్తా పంజాబ్ సినిమాలో చూపించినట్లు పంజాబ్ లో ప్రతి ఇంట్లో ఒకరు డ్రగ్స్ కు ఎడిక్ట్ అయ్యారని, అందులో ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు.
సులువుగా...
ఇక్కడ కూడా డ్రగ్స్ సరఫరా సులువుగా జరుగుతుందని చెప్పారు. ఇంటర్నేషనల్ స్కూళ్లకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు గుర్తించామని సీవీ ఆనంద్ తెలిపారు. తనకు తెలిసిన వాళ్ల పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిసయ్యారని ఆనంద్ చెప్పారు. సూళ్లకు, కాలేజీలకు సులువుగా డ్రగ్స్ ను చేరవేస్తున్నారని ఆయన అన్నారు.
ఇకపై వినియోగదారులను కూడా....
ఇక గంజాయి సరఫరా సెకండ్ లెవెల్ టౌన్ లకు పాకిందని సీవీ ఆనంద్ చెప్పారు. అయితే డ్రగ్స్ ను అరికట్టడానికి తమ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇప్పటి వరకూ డీలర్ల మీదనే దృష్టి పెట్టామని, ఇకపై వినియోగదారులను కూడా అరెస్ట్ చేస్తామని సీీవీ ఆనంద్ హెచ్చరించారు.