కూల్చివేతలపై రంగనాధ్ చేసిన హాట్ కామెంట్సిఇవే

హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-17 11:41 GMT

కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పడక ముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లమని రంగనాధ్ తెలిపారు. జులై తర్వాత చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదని ఆయన హెచ్చరికలు జారీచేశారు.


కొత్తగా తీసుకున్న...

కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా పరిశీలిస్తుందన్న కమిషనర్ రంగనాథ్ చెరువులు, నాలాలను ఆక్రమించిన ఇళ్ల నిర్మాణం చేపడితే చర్యలు తప్పవన్నారు. బఫర్ జోన్, ఎఫ్ సీ ఎల్ పరిధిలో లేని వాటి జోలికి వెళ్లబోమని తెలిపారు. అవి ఆక్రమణలు అని తేలి, ప్రభుత్వానికి చెందిన భూమి అన్నది నిర్ధారణ అయితే కూల్చేవేస్తామని చెప్పారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now       



Tags:    

Similar News