మళ్లీ మొదలైన హైడ్రా కూల్చివేతలు.. ఈ ప్రాంతాల్లోనే!!

మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా

Update: 2024-09-08 04:23 GMT

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) అధికారులు మేడ్చల్ జిల్లా దుండిగల్‌లో అక్రమ నిర్మాణాలకు వ్యతిరేకంగా కూల్చివేతలు ముమ్మరం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ఏరియా మీద హైడ్రా కన్నెర్ర జేస్తుందా అని భయపడుతూ ఉండగా ఆదివారం నాడు మరోసారి కూల్చివేతలు మొదలయ్యాయి. హైడ్రా ఫుల్ ట్యాంక్ లెవల్ (FTL), నీటి వనరుల చుట్టూ ఉన్న బఫర్ జోన్‌లకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించి కట్టిన అనధికార నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఆదివారం ఉదయం, మల్లంపేటలోని కత్వ చెరువు సమీపంలో లక్ష్మీ శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ నిర్మించిన విల్లాను హైడ్రా కూల్చివేసింది.

ఇక మాదాపూర్ సున్నం చెరువు లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం 26 ఎకరాలు కాగా.. చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ 15 ఎకరాల 20 గుంటలు. 2013లో ఇరిగేషన్ అధికారులు సర్వే చేసినప్పుడు 15 ఎకరాల 23 గుంటల్లో చెరువులో నీళ్లు ఉన్నాయి. కబ్జా చేసిన భారీ భవనాలను, షెడ్లను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. పదుల సంఖ్యలో షేడ్స్ నిర్మించి వ్యాపారాలు నిర్వహిస్తున్న కబ్జాదారులు. భారీ పోలీస్ బందోబస్త్ నడుమ హైడ్రా కూల్చివేతలు జరిగాయి.


Tags:    

Similar News