ఉదయాన్నే హైడ్రా కూల్చివేతలు ప్రారంభం
హైదరాబాద్ లో నాలాపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. శుక్రవారం ఉదయం నుంచే కూల్చివేతలను ప్రారంభించింది
హైదరాబాద్ లో నాలాపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా కూల్చివేసింది. నగరంలోని అడిక్‌మెట్ ప్రాంతంలోని రాంనగర్ లో ఉన్న మణెమ్మ కాలనీలో కొందరు నాలాను ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో స్వయంగా కమిషనర్ రంగాధ్ రెండు రోజుల క్రితం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
నాలాపై నిర్మించిన...
అయితే ఈ నిర్మాణాలపై నివేదిక ఇవ్వాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను కోరారు. అది ఆక్రమణ అని నివేదికను అధికారులు ఇవ్వడంతో ఈరోజు ఉదయం కూల్చివేతలను చేపట్టారు. నాలాలు, చెరువులు ఆక్రమించి నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చి వేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో హైడ్రా కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటున్నారు.