Hyderabad : హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు ప్రారంభం

హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు మరోసారి ప్రారంభమయ్యాయి. మణికొండలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.;

Update: 2025-01-10 03:50 GMT

హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు మరోసారి ప్రారంభమయ్యాయి. మణికొండలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఉదయం నుంచి కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. నెక్నాపూర్ చెరువును ఆక్రమించి సాగిన నిర్మాణాలను హైడ్రా అధికారులు బుల్ డోజర్ల సాయంతో అధికారులు కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు.

చెరువు ఆక్రమించారని...
చెరువును ఆక్రమించారని హైడ్రా కమిషనర్ రంగనాధ్ కు స్థానికులు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆయన ఆక్రమణలుగా నిర్ధారించిన తర్వాత వాటిని కూల్చివేయాలని హైడ్రా అధికారులను ఆదేశించడంతో ఈరోజు ఉదయం నుంచి కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలను హైడ్రా సిబ్బంది కొనసాగిస్తున్నారు.


Tags:    

Similar News