హైడ్రా కూల్చివేసింది ఎవరెవరి నిర్మాణాలంటే?

హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను కూల్చివేసిన దానిపై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక అందించింది

Update: 2024-08-25 11:50 GMT

హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను గత ఇరవై రోజుల్లో కూల్చివేసిన దానిపై హైడ్రా ప్రభుత్వానికి నివేదిక అందించింది. హైదరాబాద్ లో మొత్తం పద్దెనిమిది చోట్ల తాము నిర్మాణాలను కూల్చివేసినట్లు పేర్కొంది. పలువురు వీఐపీలతో పాటు రియల్ ఎస్టేట్ సంస్థలు చేసిన కబ్జాలను తొలగించినట్లు నివేదికలో పేర్కొంది. మొత్తం పద్దెనిమిది చోట్ల కూల్చివేత కారణంగా ప్రభుత్వానికి చెందిన మొత్తం 43 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.

ప్రభుత్వానికి నివేదిక...
ఇందులో పల్లంరాజు, సినీ హీరో నాగార్జునతో పాటు రత్నాకర్ రాజు, సునీల్ రెడ్డి, భాస్కరరావు, అనుపమలకు చెందిన కట్టడాలను కూల్చివేశామని తెలిపింది. ఇప్పటి వరకూ బంజారాహిల్స్, నందినగర్, మన్సూరాబాద్, లోటస్ పాండ్, బీజేఆర్ నగర్, ఎమ్మెల్యే కాలనీ, అమీర్‌పేట్, గాజులరామారంలో అనేక నిర్మాణాలను కూల్చివేశామని తెలిపింది. ఇందులో అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులు ఉన్నారు. ఎంఐఎంకు చెందిన ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, మాజీ కేంద్రమంత్రి ఒకరు, టీటీడీ మాజీ సభ్యుడు,బీజేపీ నేత, ప్రొ కబడ్డీ యజమాని, సినీ నటుడు, దానం నాగేందర్ కూడా ఉన్నారని తెలిపింది.


Tags:    

Similar News