Allu Arjun : అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు. రామ్ గోపాల్ పేట్ పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మరోసారి నోటీసులు జారీ చేశారు. రామ్ గోపాల్ పేట్ పోలీసులు ఈ నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి ఈ నోటీసులను రామ్ గోపాల్ పేట్ పోలీసులు అందచేశారు. ఈరోజు కిమ్స్ ఆసుపత్రికి రావద్దంటూ పోలీసులు అల్లు అర్జున్ కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ మేరకు రామ్ గోపాల్ పేట్ ఎస్ఐ అల్లు అర్జున్ ఇంటికి వచ్చి నోటీసులు అందచేశారు.
కిమ్స్ ఆసుపత్రికి...
ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయిన తర్వాత నేరుగా కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి సంథ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ రానున్నారని సమాచారం అందడంతో పోలీసులు అక్కడకు రావద్దంటూ నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ