Big Breaking: చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదల
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈరోజు ఉదయం ఆయన విడుదలయ్యారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. ఈరోజు ఉదయం ఆయన విడుదలయ్యారు. నిన్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో పోలీసులు చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్ ను పోలీసులు తరలించారు. అయితే ఆయనకు జైలుకు చేరుకుని ఫార్మాలటీస్ పూర్తి చేసే సమయంలోనే బెయిల్ వచ్చిందని వార్త తెలియడంతో ఆయన చంచల్ గూడ జైలు రిసెప్షన్ లోనే ఉన్నారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు జైలు అధికారులకు చేరడం ఆలస్యమయింది. దీంతో ఆయన నిన్న రాత్రి విడుదల కావాల్సి ఉండగా ఈరోజు ఉదయం విడుదలయ్యారు.
రెండు గంటల పాటు...
చివరకు బెయిల్ ఉత్తర్వులు అందడంతో అల్లు అర్జున్ ను జైలు నుంచి విడుదల చేశారు. శుక్రారం రాత్రంతా అల్లు అర్జున్ జైలులోనే ఉన్నారు. అయితే జైలు లోపలికి వెళ్లలేదని, సూపరింటెండెంట్ వద్దనే కూర్చుని ఉన్నారని జైలు సిబ్బంది చెబుతున్నారు. సంధ్యాథియేటర్ లోజరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన కేసులో మధ్యాహ్నం 12.15 గంటలప్రాంతంలో పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఈరోజుఉదయం వరకూ హైడ్రామా నడిచింది.
ఉదయంనుంచి...
తొలుత అల్లు అర్జున్ ను నిన్న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. తర్వాత అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లికోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలోనే ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆయన అభిమానులు చిక్కడ పల్లి పోలీస్ స్టేషన్, గాంధీ ఆసుపత్రి, నాంపల్లి కోర్టు, చంచలగూడ జైలు వద్ద భారీ సంఖ్యలో గుమికూడటంతో ఆ ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తంమీద అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు.