Allu Arjun : జైలు నుంచి విడుదలయ్యాక అల్లు అర్జున్ ఏమన్నారంటే?

తాను బాగున్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు.

Update: 2024-12-14 03:25 GMT

తాను బాగున్నానని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. ఇంటికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని చెప్పారు. అనుకోకుండా జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఇది అని ఆయన పేర్కొన్నారు. కోర్టులో కేసు ఉంది కాబట్టి దీని గురిం తాను ఏమీ మాట్లాడలేనని తెలిపారు. తనకు మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు అని చెప్పారు.

రేవతి కుటుంబానికి...
రేవతి కుటుంబానికి జరిగిన ఘటనపై తాను చింతిస్తున్నానన్న అల్లు అర్జున్ చట్టాన్ని తాను గౌరవిస్తానని చెప్పారు. సంథ్యా థియేటర్ లో జరిగిన ఘటన దురదృష్టకరమని చెప్పారు. మరణించిన రేవతి కుటుంబానికి తన సానుభూతి అని ప్రకటించారు. తన అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా అల్లు అర్జున్ మీడియాతో అన్నారు. ఇంటికి చేరిన తర్వాత ఆయన భార్య పిల్లలు కొంత భావోద్వేగానికి గురయ్యారు.


Tags:    

Similar News