Breaking : రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ కౌంటర్
సంధ్యా థియేటర్ జరిగిన ఘటన దురదృష్టకరమని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు
సంధ్యా థియేటర్ జరిగిన ఘటన దురదృష్టకరమని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇది కేవలం ప్రమాదం మాత్రమేనని ఆయన తెలిపారు. బాధిత కుటుంబానికి తన సానుభూతి అని తెలిపారు. ఇది ఎవరి తప్పు కాదని, పోలీసులు, సినిమా యూనిట్ అందరూ మంచి ఉద్దేశ్యంతో చేసిన విషయమే అయినా అనుకోకుండా ప్రమాదం జరిగిందని తెలిపారు. ఆ కుటుంబానికి జరిగిన బాధను తాను చెప్పుకోలేకపోతున్నానని తెలిపారు. అభిమానుల మనసులను గెలుచుకోవాలన్న ఉద్దేశ్యమే తనకు ఉందన్నారు. ఎవరూ ఇలాంటి ఘటనను కోరుకోరని అన్నారు. ఆ బాలుడు కోలుకుంటుండం తనకు చాలా సంతోషం కలిగిస్తుందన్నారు. తాను ఎవరినీ నిందించడం లేదన్నారు.
ప్రభుత్వం సహకరించిందని...
బాలుడి సంరక్షణ భాధ్యత నాదే...
ఇందులో ఎవరి తప్పు లేదని అల్లు అర్జున్ అన్నారు. తనపై చేస్తున్న ఆరోపణలు వింటే బాధేస్తుందన్నారు. పోలీసులే ట్రాఫిక్ క్లియర్ చేశారని చెప్పారు. అంత మంది అభిమానులు ప్రేమ చూపిస్తుంటే తాను కార్లో కూర్చుంటే గర్వమని అనుకుంటారని అన్నారు. తర్వాత రోజు ఆసుపత్రికి వెళ్దామంటే పోలీసులు అంగీకరించలేదన్నారు. తనకు కూడా అదే వయసు పిల్లాడు ఉన్నాడన్నారు. తాను రోడ్ షో ఊరేగింపులు చేయలేదన్నారు. ఆ బాలుడి సంరక్షణను తాను తీసుకుంటానని తెలిపారు. న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయనే వెళ్లలేదనిఅల్లు అర్జున్ చెప్పారు. తాను,డైరెక్టర్ సుకుమార్ ఆ కుటుంబానికి ఎంతో చేయాలని అనుకున్నామని, కానీ వాటిని బహిరంగ పర్చలేమనితెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now