Allu Arjun : నేడు కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు కిమ్స్ ఆసుపత్రికి రానున్నారు. శ్రీతేజ్ ను పరామర్శించనున్నారు.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు కిమ్స్ ఆసుపత్రికి రానున్నారు. శ్రీతేజ్ ను పరామర్శించనున్నారు. పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంథ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో దాదాపు ఇరవై రోజుల నుంచి చికిత్స పొందుతున్నారు. శ్రీతేజ్ ఇంకా కోలుకోలేదు.
పోలీసుల అనుమతి...
అయితే శ్రీతేజ్ ను పరామర్శించడానికి వెళ్లలేదని అల్లుఅర్జున్ పై విమర్శలు వినిపించాయి. దీంతో ఈరోజు అల్లు అర్జున్ కిమ్స్ ఆసుపత్రికి వచ్చి శ్రీతేజ్ ను పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పోలీసుల అనుమతి కోరారు. పోలీసులు కూడా పరామర్శకు అనుమతించారు. కిమ్స్ ఆసుపత్రి వద్ద భారీగా పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now