హైడ్రా నోటీసులు.. స్పందించిన మురళీ మోహన్

సీనియర్ నటుడు మురళీ మోహన్ యాజమాన్యంలోని జయభేరి

Update: 2024-09-08 07:58 GMT

అక్రమ ఆక్రమణలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. ఇక గచ్చిబౌలిలోని రంగల్ కుంటలో ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్) ఉల్లంఘనకు పాల్పడినందుకు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు మురళీ మోహన్ యాజమాన్యంలోని జయభేరి కన్‌స్ట్రక్షన్స్‌ కు నోటీసులు పంపింది. జయభేరి సంస్థ చేపట్టిన నిర్మాణం గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న రంగలాల్ కుంట చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్‌టిఎల్), బఫర్ జోన్‌లో ఉన్నట్లు హైడ్రా అధికారులు కనుగొన్నారు. ఈ షెడ్ తొలగించేందుకు జయభేరికి హైడ్రా 15 రోజుల సమయం ఇచ్చింది. లేదంటే తామే తొలగిస్తామని హెచ్చరించింది.

హైడ్రా నోటీసులపై సీనియర్ నటుడు మురళీమోహన్ స్పందించారు. తాను 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఏనాడూ అక్రమాలకు పాల్పడలేదని చెప్పారు. జయభేరి ఎక్కడా, ఎప్పుడూ ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని, స్థానికుల ఫిర్యాదుతోనే హైడ్రా అధికారులు తమ సైట్‌కు వచ్చి పరిశీలించారని తెలిపారు. తమ రేకుల షెడ్డు బఫర్ జోన్‌‌లో మూడు అడుగుల మేర ముందుకు వచ్చినట్టు గుర్తించారన్నారు. ఆ షెడ్‌ను తామే తొలగించేస్తామని, హైడ్రా రానక్కర్లేదని వివరణ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం లోపు తాత్కాలిక షెడ్‌ను తొలగిస్తామన్నారు.


Tags:    

Similar News