Metro Train : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎల్ అండ్ టీ

మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఎల్ అండ్ టీ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-08-24 12:47 GMT

మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఎల్ అండ్ టీ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. సెప్టంబరు 1వ తేదీ నుంచి నాగోలు, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ ఫీజును వసూలు చేసే కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ఎల్ అండ్ టీ కంపెనీ ప్రకటించింది. పెయిడ్ పార్కింగ్ ను వచ్చే నెల 1వ తేదీ నుంచి అమలు చేస్తామని ఎల్ అండ్ టి కంపెనీ ప్రకటించడంతో పెద్దయెత్తున వాహనదారుల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. నాగోలు మెట్రో స్టేషన్ వద్ద ఆందోళనకు కూడా ప్రయాణికులు దిగారు.

ఆక్యుపెన్సీ రేటు పెరగడం ఎలా?
నిజానికి తక్కువ ఖర్చుతో వెంటనే తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు మెట్రోను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల పెయిడ్ పార్కింగ్ ను అమలు చేస్తున్నారు. ప్రైవేట్  సంస్థలకు పెయిడ్ పార్కింగ్ ను కాంట్రాక్టుకు ఇవ్వడంతో గంటకు ఇరవై ఐదు రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇది భారంగా మారడంతో పెయిడ్ పార్కింగ్ అమలు చేసే చోట మెట్రో రైలులో ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ స్థలాలు ప్రైవేట్  కాంట్రాక్టర్లు ఇస్తే వారు అడ్డగోలుగా వసూలు చేస్తారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. నాగోలు, మియాపూర్, ఎల్‌బినగర్ మెట్రో స్టేషన్ల నుంచి రోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది ఉద్యోగులు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, వ్యాపారులతో పాటు సాధారణ ప్రయాణికులు కూడా ఉన్నారు.
ఎంత ఖర్చవుతుందో?
మెట్రో రైల్వేస్టేషన్లకు ఇంటి నుంచి బయలుదేరి రావాలంటే ఆటోలో రావాలి. ఆటోకు కొంత మొత్తం చెల్లించాలి. తిరిగి పెయిడ్ పార్కింగ్ అంటూ వసూళ్లు మొదలు పెడితే దాని కంటే సొంత వాహనాలపై వెళ్లడమే బెటర్ అవుతుంది. ఎందుకంటే ఇంటికి రాను, పోను ఆటో ఖర్చుతో పాటు పార్కింగ్ ఫీజు, మెట్రో రైలు ఛార్జీలను కలుపుకుంటే సొంత వాహనంలోనే వెళ్లిరావడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీని వల్ల మెట్రోకు ఆక్యుపెన్సీ రేటు తగ్గడమే కాకుండా హైదరాబాద్ రహదారులపై ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడతాయి.
ట్రాఫిక్ సమస్య...
కేవలం ట్రాఫిక్ సమస్య పెరగడమే కాదు. ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశముంటుంది. మెట్రో రైళ్ల సంఖ్య పెంచాల్సిన సమయంలో ప్రయాణికులపై పెయిడ్ ఛార్జీల పేరుతో బాదుడు కార్యక్రమం ఎల్ అండ్ టి సంస్థ మొదలు పెడితే ప్రయాణికులు ఎందుకు వస్తారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. ప్రభుత్వంపై పై కూడా వ్యతిరేకత వస్తుంది. అందుకే నాగోలు, మియాపూర్ మెట్రో స్టేషన్ల నుంచి పెయిడ్ పార్కింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించడం కొంత ఊరట కలిగించే అంశమే.


Tags:    

Similar News