Breaking : మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ
మంచు విష్ణుపై మరోసారి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు.
సినీ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో మళ్లీ రచ్చ మొదలయింది. మంచు విష్ణుపై మరోసారి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. మంచు విష్ణు నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. మంచు విష్ణుతో పాటు వినయ్ పై కూడా మంచు మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోసారి ఫిర్యాదుతో...
మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొంత కాలంగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. ఏడు అంశాలపై ఈసారి మంచు మనోజ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఫిర్యాదును తీసుకున్నారు. తాము విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పహాడీ హరీఫ్ పోలీసులు చెప్పినట్లు తెలిసింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now