దాడి ఘటనపై మంచు విష్ణు ఏమన్నారంటే?
జల్పల్లిలో జరిగిన దాడి ఘటనపై మంచు విష్ణు స్పందించారు
జల్పల్లిలో జరిగిన దాడి ఘటనపై మంచు విష్ణు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గత మూడు రోజుల నుంచి ఒక వర్గం మీడియా అనుచితంగా తమ కుటుంబం పట్ల వ్యవహరించిందన్నారు. అయితే తన తండ్రి మోహన్ బాబు చేసిన తప్పును సమర్థించడం లేదన్నారు. ఆవేశంతో అనుకోకుండా జరిగిన పని అని మంచు విష్ణు అన్నారు.
విచారకరమే కానీ...
జల్పల్లిలో తమ నివాసం గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి రావడంతో కొంత ఆవేశంతో మోహన్ బాబు ఉన్నారన్న మంచు విష్ణు నిన్న వీడియోను పరిశీలిస్తే మోహన్ బాబు వస్తూ చేతులు జోడిస్తూ వచ్చారన్నారు. అయితే నిన్న జరిగిన సంఘటన పట్ల చింతిస్తున్నానని తెలిపారు. అలాగే తాను బాధితుడి కుటుంబంతో టచ్ లో ఉన్నానని, వారికి ధైర్యంచెప్పానని మంచు విష్ణు తెలిపారు.