Hyderabad : హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. మెట్రో రైళ్ల వేళల పొడిగింపు
న్యూఇయర్ వేడుకలకు సందర్భంగా మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు
న్యూఇయర్ వేడుకలకు సందర్భంగా మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో మెట్రో రైళ్లు రాత్రి 12.30 గంటల వరకూ నడవనున్నాయి. నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైళ్ల సమయాన్నిఈరోజు పొడిగించినట్లు మెట్రో రైలు ఎండీీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈరోజు అర్ధరాత్రి వరకూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త సంవత్సర వేడుకలు జరగనున్నాయి.
అర్ధరాత్రి వరకూ...
ఈ నేపథ్యంలో సొంత వాహనంలో ప్రయాణించకుండా మెట్రో రైలులో ప్రయాణించడం మంచిదని సూచిస్తున్నారు. పబ్ లు, పార్టీల్లో పాల్గొన్న వారికి అర్ధరాత్రి 12.30 గంటల వరకూ మెట్రో రైళ్లు నేడు అందుబాటులో ఉంటాయని చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ నుంచి తప్పించుకోవాలంటే, కొత్త ఏడాది ఆనందంగా ఉండాలంటే మెట్రో రైలు ప్రయాణం మంచిదని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. అలాగని మెట్రో రైళ్లలో ప్రయాణించే వారు కూడా జాగ్రత్తలు పాటించాలని కోరారు.