Merto Trains : హైదరాబాద్ లో నిలిచిన మెట్రో రైళ్లు
హైదరాబాద్ లో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. నాగోల్ - రాయదుర్గం మధ్య మెట్రో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి;

హైదరాబాద్ లో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి. నాగోల్ - రాయదుర్గం మధ్య మెట్రో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఉదయం కార్యాలయాలకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. అయితే సాంకేతక కారణంతోనే మెట్రో రైలు వ్యవస్థ నిలిచిపోయిందని, సిగ్నలింగ్ వ్యవస్థ పనిచేయకపోవడంతోనే మెట్రో రైళ్లు కాసేపు నిలిచిపోయాయని అధికారులు చెబుతున్నారు.
కార్యాలయాలకు వెళ్లలేక...
మెట్రోరైళ్లు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఏమయిందో తెలియక గాబరా పడ్డారు. అయితే సాంకేతిక సమస్య కారణమని అధికారులు తేల్చారు. మెట్రోలో అప్పుడప్పుడు ఇలా సాంకేతిక లోపాలు తలెత్తి రైళ్లు నిలిచిపోవడం సాధారణమే అయినప్పటికీ ప్రయాణికులు మాత్రం కార్యాలయాలకు సకాలంలో చేరలేక ఇబ్బందులు పడ్డారు.