రాత్రి ఒంటిగంట వరకూ మెట్రో
హైదరాబాద్‌లో ఈరోజు రాత్రి ఒంటి గంట వరకూ మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఈ మేరకు మెట్రో అధికారులు నిర్ణయించారు
హైదరాబాద్‌లో ఈరోజు రాత్రి ఒంటి గంట వరకూ మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఈ మేరకు మెట్రో అధికారులు నిర్ణయించారు. వినాయకుడి నిమజ్జనం జరుగుతుండటంతో మెట్రో సర్వీసులు నడపాలని నిర్ణయించాయి. హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం అంటే అర్థరాత్రి దాటే వరకూ జరుగుతుంది. నగరం నలుమూలల నుంచి వేల సంఖ్యలో గణనాధులు ట్యాంక్‌బండ్ వద్దకు చేరుకుంటాయి.
నిమజ్జనం...
హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. కిలో మీటర్ల కొద్దీ నడిచి వచ్చి తాము పూజించిన గణనాధులను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందుకే భక్తులు ఇబ్బంది పడకుండా నిమజ్జనం పూర్తయిన తర్వాత తమ ఇళ్లకు వెళ్లేందుకు మెట్రో సర్వీసులను రాత్రి ఒంటి గంట వరకూ పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు.