శ్రీతేజ్ కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయం
పుష్ప సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ శ్రీతేజ్ కుటుంబానికి యాభై లక్షల విరాళాన్ని ప్రకటించింది
పుష్ప సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ శ్రీతేజ్ కుటుంబానికి యాభై లక్షల విరాళాన్ని ప్రకటించింది. సంథ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీతేజ్ కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఈరోజు యాభై లక్షల విరాళాన్ని అందించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలోనే ఆయన యాభై లక్షల రూపాయల చెక్కును శ్రీతేజ్ తండ్రికి అందచేశారు.
ఆరోగ్య పరిస్థితిపై...
ఆసుపత్రికి వెళ్లిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్రమంగా శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతుందని వైద్యులు తెలిపారు. యాభై లక్షల రూపాయల చెక్కును అందించిన మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ మాట్లాడుతూ శ్రీతేజ్ కుటుంబానికి తమ సంస్థ అండగా ఉంటుందని తెలిపారు.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలను అందించింది. అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షల సాయాన్ని ప్రకటించారు. శ్రీతేజ్ కు తాను జీవితాంతం అండగా ఉంటానని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now