Hyderabad : నేడు హనుమాన్ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

హనుమాన్ జయంతి సందర్భంగా నేడు హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర జరగనుంది. దీంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.

Update: 2024-04-23 03:03 GMT

హనుమాన్ జయంతి సందర్భంగా నేడు హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర జరగనుంది. దీంతో అనేక ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభయ్యే ఈ యాత్ర సికింద్రాబాద్ లోని తాడిబండ్ ఆలయం వరకూ సాగనుంది. దీతో పుత్లీబౌలి క్రాస్ రోడ్స్, ఆంధ్రబ్యాంక్ కోటి క్రాస్ రోడ్స్, సుల్తాన్ బజార్ క్రాస్ రోడ్డస్, రామకోటి క్రాస్ రోడ్డస్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అశోక్ నగర్, గాంధీనగనర్, వైశ్రాయ్ హోటల్ బ్యాక్ సైడ్, ప్రాగా టూల్స్, కవాడీ గూడ, బన్సీలాల్ పేట, ప్యారడైజ్ క్రాస్ రోడ్స్ మీదుగా తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయానికి శోభాయాత్ర చేరుకుంటుంది.

పన్నెండు కిలోమీటర్లు...
దాదాపు పన్నెండు కిలోమీటర్ల మేర యాత్ర సాగనుండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. మరో వైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకూ నగరంలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని ఇప్పటికే పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. శోభాయాత్ర వెళ్లే రూటులో ఏ వాహనాన్ని అనుమతించరు. అందుకే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు.


Tags:    

Similar News