హైదరాబాద్ సీపీ కీలక నిర్ణయం
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీస్ కమిషన్ సీవీ ఆనంద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీస్ కమిషన్ సీవీ ఆనంద్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలోకి భారీ వాహనాలను ఇక అనుమతించబోమని తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని నోటిఫికేషన్ విడుదల చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నగరంలోకి ప్రవేశిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. సాధారణంగా ఉదయం ఏడు గంటలనుంచి రాత్రి 12 గంటల వరకూ భారీ వాహనాలకు నగరంలోకి అనుమతి లేదు.
భారీ వాహనాలకు...
ఈ నిబంధన ఎప్పటి నుంచో అమలులో ఉంది. కానీ ట్రాఫిక్ పోలీసులకు మామూళ్లు ఇచ్చి కొన్ని భారీ వాహనాలు సిటీలోకి వస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక భారీ వాహనాలకు మాత్రం అనుమతి ఉండదని, సామాగ్రిని మోసకెళ్లే లోకల్ వాహనాలకు రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకే అనుమతి ఉంటుందని కొత్త నిబంధనను తీసుకువచ్చారు. ప్రయివేటు ట్రావెల్స్ బస్సులకు ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ నగరంలో ఎంట్రీ లేదని పోలీసులు చెప్పారు.