న్యూఇయర్ వేడుకలకు ముందే డ్రగ్స్ కలకలం
హైదరాబాద్ గచ్చిబౌలిలోని క్రాక్ ఆరీనా క్లబ్ లో డ్రగ్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
న్యూఇయర్ సెలబ్రేషన్స్ కు ముందే హైదరాబాద్ లో డ్రగ్స్ పార్టీ కలకలకం రేపింది. గచ్చిబౌలిలోని క్రాక్ ఆరీనా క్లబ్ లో డ్రగ్ పార్టీ జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ పబ్ కు హాజరైన ఎనిమిది మందికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలిందని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్ గా తేలడంతో పోలీసులు వారిని విచారిస్తున్నారు.
విచారణ జరుపుతూ...
అయితే వారు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకుని వచ్చారు? బయట తీసుకుని వచ్చిఈ క్లబ్ కు అటెండర్ అయ్యారా? అన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్ వినియోగించడానికి ఎక్కడ నుంచి ఎవరు దానిని తీసుకువచ్చారు? అమ్మిందెవరు? డ్రగ్స్ ను ఎక్కడి నుంచి తీసుకు వచ్చారు? అన్న కోణంలో పోలీసులు వారిని విచారిస్తున్నట్లుతెలిసింది. పోలీసులుబెమ్ బూమర్ షో సందర్భంగా జరిగిన డీజే పార్టీలో ఈ డ్రగ్స్ బయటపడ్డాయి.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now