అత్యవసరం ఉంటేనే బయటకు రండి.. ఈ నెంబర్లను సంప్రదించండి
హైదరాబాద్ నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు
హైదరాబాద్ నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తతో ఉండాలని జీహెచ్‌ఎంసీ కమిషర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి వెస్తునన్నందున మూసి పరివాహక ప్రాంతాలు లోతట్టు ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా సమస్య ఉంటే జీహెచ్‌ఎంసీ హెల్ప్ లైన్ నెంబర్ 040- 21111111 నెంబర్ లేదా డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు. అలాగే ఈవీడీఎమ్ కంట్రోల్ రూమ్ 9000113667 నెంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.
హైదరాబాద్‌కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. అధికారులు నిత్యం అందుబాటులో ఉండాలని ఆదేశించింది. డీఆర్‌ఎఫ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించింది. రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. ట్యాంక్‌బండ్‌లో వాటర్ లెవల్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను జీహెచ్‌ఎంసీ ఆదేశించింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌ను కూడా పర్యవేక్షిస్తూ గేట్లు ఎత్తివేయాలని ఆదేశాలు జారీచేసింది. మూసీ పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఖైరతాబాద్, అమీర్‌పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్‌పేట, సైదాబాద్, పాతబస్తీ, ఎల్బీనగర్, సాగర్‌రింగ్‌రోడ్, హస్తినాపురం, బీఎన్‌రెడ్డి, నాగోల్, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, ఈసీఐఎల్, సికింద్రాబాద్, బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైస్, బోయిన్‌పల్లి, సుచిత్ర, కొంపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, చిలకలగూడ, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, నిజాంపేట్, ప్రగతినగర్, కేపీహెబీ కాలనీ, ఆల్విన్ కాలనీ, మియాపూర్, కుత్భుల్లాపూర్, బీహెచ్‌ఈఎల్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మెహదీపట్నంలో భారీగా వర్షం కురుస్తూ ఉంది.