నేడు కొత్తగూడ ఫ్లైఓవర్ ప్రారంభం
హైదరాబాద్ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా కొత్తగూడ ఫ్లైఓవర్ ను అందివ్వనుంది.
హైదరాబాద్ వాసులకు రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా కొత్తగూడ ఫ్లైఓవర్ ను అందివ్వనుంది. ఎస్సార్డీపీ పథకం కింద 18వ ఫ్లైఓవర్ ను నిర్మించారు. దీనివల్ల గచ్చిబౌలి పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యను చాలా వరకూ తొలగించే వీలుంది. 263 కోట్ల రూపాయలతో కొత్తగూడ నుంచి గచ్చిబౌలి వరకూ 2,216 మీటర్ల మేర ఫ్లైఓవర్ ను నగర పాలక సంస్థ నిర్మించింది. ఈరోజు మంత్రి కేటీఆర్ ఈ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు.
2,216 మీటర్ల పొడవున...
ఫ్లైఓవర్లతో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రత్యేకంగా వీటి నిర్మాణం చేపట్టింది. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి ఫ్లైఓవర్లు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావించి వీటి నిర్మాణం వేగిరం పూర్తి చేసింది. ఎస్సార్డీపీ కింద ఈ ఫ్లైఓవర్లను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వీటిని శరవేగంతో నిర్మిస్తూ వచ్చింది. ప్రధానంగా సాఫ్ట్ వేర్ కంపెనీలకు ఈ కొత్తగూడ ఫ్లైఓవర్ ఉపయోగపడనుంది. వేగంగా గమ్యస్థానం చేరుకోవడానికి వీలవుతుంది.