‌Hyderabad : నిమజ్జనానికి పేరుకుపోయిన వ్యర్థాలు ఎన్ని టన్నులో తెలుసా?

వినాయకుడి నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో వేల టన్నలు వ్యర్థాలు పేరుకుపోయాయి.

Update: 2024-09-18 04:36 GMT

ganesh, immersion

వినాయకుడి నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో వేల టన్నలు వ్యర్థాలు పేరుకుపోయాయి. నిన్న గణేశ్ నిమజ్జనం జరగడంతో వివిధ రకాల వస్తువులతో అనేక ప్రాంతాల్లో వ్యర్థాలు నిండిపోయాయి. ఇప్పటికే దాదాపు వెయ్యి టన్నులకు పైగానే వ్యర్థాలున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు గుర్తించారు.

200 టీంలతో...
అయితే వీటిని ఎప్పటికప్పుడు తొలగించేందుకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా రెండు వందల టీంలను జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. తొలగించిన వ్యర్థాలను డంప్ యార్డులను తరలించడానికి వాహనాలను సిద్ధం చేశారు. వేల సంఖ్యలో గణనాధులు నిన్నటి నుంచి నిమజ్జనం అవుతుండటంతో అనేక ప్రాంతాల్లో ఈ వ్యర్థాలు నిండిపోయాయని జీహెచ్ఎంసీ అధికారులుు తెలిపారు.


Tags:    

Similar News