Allu Arjun : అల్లు అర్జున్ ఇంటికి క్యూ కట్టిన టాలీవుడ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి టాలీవుడ్ చెందిన ప్రముఖులు చేరుకున్నారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి టాలీవుడ్ చెందిన ప్రముఖులు చేరుకున్నారు. ఆయనను పరామర్శించేందుకు తరలి వచ్చారు. విజయ్ దేవరకొండతో పాటు సినీ నిర్మాత దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ అధినేత రవి, దర్శకుడు సుకుమార్ , కొరటాల శివ, వంశీ అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. సంథ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మరణించిన ఘటనలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి వచ్చారు.
ఈరోజు ఉదయం విడుదలయిన...
ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం విడుదలయిన అల్లు అర్జున్ ను సినీ ప్రముఖులు పరామర్శిస్తున్నారు. రాత్రంతా జైల్లోనే గడిపిన అల్లు అర్జున్ ఈరోజు ఉదయంఇంటికి చేరుకుని కొంత సేదతీరిన తర్వాత తన వద్దకు వచ్చిన వారిని కలుస్తున్నారు. సినీ ప్రముఖులతో పాటు సన్నిహిత బంధువులు కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. ఇంకా పరామర్శలు కొనసాగుతున్నాయి.