యశ్వంత్ సిన్హాకు భారీ స్వాగతం
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించనుంది.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ హైదరాబాద్ లో భారీ ర్యాలీ నిర్వహించనుంది. బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న యశ్వంత్ సిన్హాకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఘన స్వాగతం చెబుతారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలు దేరి వెళ్లి జలవిహార్ లో ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో యశ్వంత్ సిన్హా తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని కోరనున్నారు.
ట్రాఫిక్ జాం....
నగరంలోని అన్ని నియోజకవర్గాల నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమయింది. యశ్వంత్ సిన్హాకు మద్దతు తెలుపుతూ నగరమంతా ఫ్లెక్సీలు వెలిశాయి. మరోవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతుండటంతో ఆ పార్టీ ఫ్లెక్సీలు, పోస్టర్లతో నగరమంతా నింపేశారు. దీంతో నగరం కాషాయం, గులాబీమయంగా మారింది. అయితే రెండు పార్టీలు పోటాపోటీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంతో అనేక చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చార్మినార్ వద్ద టీఆర్ఎస్ బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పోలీసులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. కొంత ఉద్రిక్త పరిస్థిితి ఏర్పడింది.