హైదరాబాద్ లో అలాంటి వాహనాలు అమ్మాలంటే...?
తెలంగాణలోని వాహనదారులకు భారీ షాక్ తగలనుంది. హై సెక్యూరిటీ నెంబరు ప్లేట్ ను పాతవాహనాలకు విధిగా పెట్టుకోవాలి
తెలంగాణలోని వాహనదారులకు భారీ షాక్ తగలనుంది. 2019కి ముందు కొన్న వెహికిల్స్ అయితే.. వాటికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు పెట్టుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ప్లేట్‌లను సెప్టెంబర్ 30వ తేదీలోగా తప్పనిసరిగా బిగించుకోవాలని సూచించింది. లేకుంటే ఆ వాహనాలను అమ్మడానికైనా, కొనడానికైనా.. వాహనంపై ఉన్న ఇన్సూరెన్స్, పొల్యూషన్ వర్తించవని వెల్లడించింది.
రోడ్డు పైకి వస్తే...
ఒకవేళ అలాంటి వాహనాలు రోడ్డుపై తిరిగితే వాటిని పట్టుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో పాత వాహనాలకు విధిగా హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించాలని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. అయితే ఇప్పుడు తాజాగా ఆదేశాలుజారీచేయడంతో ఇకపాత వాహనాలు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు లేకుండా రోడ్డు మీదకు వస్తే పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.